- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చాలా టైట్‌గా అనిపించింది.. వారు ఎలా చేస్తున్నారో కానీ దండం పెట్టాలి: స్టార్ హీరోయిన్
దిశ, సినిమా: అప్పట్లో టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించి.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది సీనియర్ హీరోయిన్ మీనా. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. మీనా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా ఎన్నో మూవీల్లో నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంలో బాలనటిగా నటించిన ఈ భామ.. ఆయన పక్కనే ముత్తు సినిమాలో నటించింది. స్టార్ హీరయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోన్న సమయంలోనే బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. విద్యాసాగర్ రీసెంట్‌గా అనారోగ్యంతో మరణించారు. భర్త చనిపోవడంతో మీనా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది.
తాజాగా మీనా ఓ ఇంటర్వ్యూకు హాజరై బోల్డ్ సన్నివేశాలపై తన మనసులో మాట బయటపెట్టింది. ‘‘నేను గ్లామర్ షోకు చాలా దూరంగా ఉన్నప్పటికీ నన్ను ఎంతో మంది.. నువ్వు ఎందుకు బోల్డ్ డ్రెస్సులు వేసుకోవు, గ్లామర్ పాత్రల్లో నటించవు అని ప్రశ్నించారు. నన్ను అలాంటి రోల్స్ చేయమని హీరో అండ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభుదేవా అడిగారు. ముఖ్యంగా తనను బోల్డ్ సీన్స్, స్విమ్ సూట్ వేసుకునే రోల్స్ లో నటించమని ప్రభుదేవా సలహా ఇచ్చారు. ఇక కొన్నాళ్లకు అలాంటి అవకాశం వచ్చింది. ప్రభుదేవాతో నటించిన మూవీలో ఓ సన్నివేశంలో స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది.
ఆ డ్రెస్ వేసుకుని మేకప్ రూమ్ నుంచి బయటకు రాలేకపోయాను. బాడీకి చాలా టైట్‌గా అనిపించింది. అందరి ముందు ఆ డ్రెస్ లో ఉండాలంటే చాలా సిగ్గుగా అనిపించింది. ఆ పరిస్థితి నుంచి ఎలా బయట పడతానో అని చాలా భయపడిపడ్డాను. ఎక్స్ పోజింగ్ చేయడం, బోల్డ్ సన్నివేశాల్లో యాక్ట్ చేయడం ఎంత చాలా కష్టం. ఇలాంటి సన్నివేశాల్లో ఎలా చేస్తున్నారో తెలియదు గానీ.. బోల్డ్ సీన్స్ లో అలాంటి డ్రెస్సులు వేసుకుని యాక్ట్ చేసే హీరోయిన్లకు దండం పెట్టాలి’’ అంటూ మీనా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మీనా కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.