Janhvi Kapoor: తల్లి జయంతి సందర్భంగా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి అక్కడికి వెళ్లిన జాన్వీ కపూర్.. స్పెషల్ పోస్ట్ వైరల్

by Hamsa |
Janhvi Kapoor: తల్లి జయంతి సందర్భంగా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి అక్కడికి వెళ్లిన జాన్వీ కపూర్.. స్పెషల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: నేడు అతిలోక సుందరి శ్రీదేవి 61వ జయంతి అన్న సంగతి తెలిసిందే. ఆమె సినిమాలపై ఇష్టంతో నాలుగేళ్ల వయసులోనే ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ వంటి భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలోనే శ్రీదేవి మరణించి ఫ్యాన్స్‌ను విషాదంలోకి నెట్టేసింది. అయితే నేడు ఆమె జయంతి కావడంతో జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవికి విషెస్ తెలిపింది. తల్లితో కలిసి ఉన్న ఫొటోలు కూడా షేర్ చేసింది.

అలాగే తల్లి పుట్టినరోజు సందర్భంగా.. తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి తిరుపతికి వెళ్లింది. మెట్ల దారిలో వెళ్లి మరీ స్పెషల్ పూజలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, జాన్వీ కపూర్ పలు హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రజెంట్ అమ్మడు దృష్టి మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీపై పెట్టింది. తెలుగులో ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న చిత్రంలోనూ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసింది. అలాగే తెలుగులో మరో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

(Video Link Credits to janhvikapoor Instagram Channel)

Advertisement

Next Story