Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ దుస్తులపై ఇంత కేర్ తీసుకుంటాడా .. వైరల్ అవుతున్న శ్రీ రాపాక కామెంట్స్

by Prasanna |
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ దుస్తులపై ఇంత కేర్ తీసుకుంటాడా .. వైరల్ అవుతున్న శ్రీ రాపాక కామెంట్స్
X

దిశ, సినిమా: హీరోయిన్ శ్రీ రాపాక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ ఈ ముద్దుగుమ్మను పరిచయం చేసాడు. తన మొదటి మూవీ తోనే బోల్డ్ బ్యూటీగా ఫేమస్ అయింది. ఆర్జీవీ డైరెక్షన్ చేసిన నగ్నం అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి మరి నటించింది. అప్పటి నుంచి అలాంటి పాత్రలే రావడంతో నటించడం ఆపేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్ళి, ఆమె ఆటతో అందర్ని ఆకట్టుకుంది.

ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ రాపాక మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. నగ్నం మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మీ అందరూ అనుకుంటున్నట్టు నేను ఆ మూవీలో దుస్తులు లేకుండా నటించలేదు. స్కిన్ కలర్ డ్రస్ వేసుకున్నాను కానీ, అలా చేసినట్టు ఎవరికీ తెలీదు. అలాగే ఆ మూవీ షూటింగ్ లో నేను, డైరెక్టర్ ఒక కెమెరామన్ మాత్రమే ఉన్నాం. ఈ మూవీ షూటింగ్ చాలా తక్కువ మందితోనే జరిగింది. ఒకవేళ నేను అలా నగ్నంగా కనిపిస్తే మా డైరెక్టర్ ఊరుకుంటాడా.. వెంటనే నా ఫోటో షూట్స్ పెట్టె వాడు కదా అంటూ నవ్వుతూ చెప్పింది శ్రీ రాపాక. ఈమె మాట్లాడిన ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియో చుసిన నెటిజెన్స్ రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ దుస్తులపై ఇంత కేర్ తీసుకుంటాడా అంటూ కామెంట్స్ చేస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed