బేబీ బాయ్‌కు వెల్‌కమ్ చెప్పిన స్టార్ హీరోయిన్

by sudharani |
బేబీ బాయ్‌కు వెల్‌కమ్ చెప్పిన స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ బేబీ బాయ్‌కు వెల్‌కమ్ చెప్పింది. ఓపెన్ హార్ట్‌తో రాకుమారుడిని ఆహ్వానించామని ఇన్‌స్టావేదికగా తెలిపిన సోనమ్.. డాక్టర్స్, నర్సులు, ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఇకపై తమ జీవితాలు పూర్తిగా ఆనందమయంగా మారిపోతాయని ఆనందం వ్యక్తం చేసింది. కాగా ఈ విషయంపై స్పందించిన నీతూ కపూర్.. సోనమ్-ఆనంద్ ఆహుజాకు కంగ్రాట్స్ చెప్పింది. బేబీ బాయ్ రాకతో అమ్మమ్మ, తాతయ్యలుగా మారిన సునీతా కపూర్‌, అనిల్ కపూర్‌కు శుభాకాంక్షలు తెలిపింది.

Advertisement

Next Story