బిడ్డకు పాలివ్వడంపై నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ కోరిక లేదంటూ

by Anjali |
బిడ్డకు పాలివ్వడంపై నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ కోరిక లేదంటూ
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్ సోనమ్ కపూర్ తన బిడ్డకు పాలివ్వడం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మేరకు ఒక సెలబ్రిటీగా, ముఖ్యంగా మహిళా నటిగా తన అందం కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయోగాలు చేయట్లేదని, సాధారణ స్త్రీలాగే పసిబిడ్డకు పాలుపడుతున్నట్లు తెలిపింది. 2022 ఆగస్ట్‌లో మగబిడ్డను స్వాగతించిన సోనమ్ మరో యేడాది పాటు ఇలాగే కొనసాగించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ‘ఈ దశలో ఉన్నప్పుడు శరీరానికి ఆహారం, విశ్రాంతి, శక్తి చాలా అవసరం. అందుకే నేను ఎలాంటి క్రేజీ డైట్‌ ఫాలో కావట్లేదు. కానీ, ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నా. ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా యోగా, ఎక్సర్‌సైజ్ చేసినందుకే ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నా’ అంటూ పలు విషయాలు వెల్లడించింది.


Advertisement

Next Story