- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నాకు దక్కిన గొప్ప అవకాశాన్ని దీపిక లాగేసుకుంది: సోనమ్
by Aamani |

X
దిశ, సినిమా : 2014లో వచ్చిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాలో అవకాశం చేజారడంపై సోనమ్ బజ్వా ఓపెన్ అయింది. నిజానికి ఈ మూవీలో తాను నటించాల్సివున్నప్పటికి అనూహ్యంగా తనను తప్పించి దీపికను తీసుకున్నారని చెప్పింది. ప్రధానంగా పంజాబీ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న సోనమ్.. ‘హ్యాపీ న్యూ ఇయర్’లో మహిళా ప్రధాన పాత్ర కోసం తాను ఆడిషన్‌కు వెళ్లినట్లు వెల్లడించింది. అంతేకాదు ఆడిషన్ సమయంలో తనకు ఓ సీన్ ఇచ్చి నటించామని చెప్పారన్న ఆమె.. ‘చిక్నీ చమేలీ’కి డ్యాన్స్ కూడా చేయమని అడిగారని చెప్పింది. ఇదంతా చేసిన తర్వాత ఒకే అన్నట్లే సిగ్నల్ ఇచ్చిన మేకర్స్ చివరికి దీపికా పదుకొణెను హీరోయిన్‌గా పెట్టి సినిమా తీయడంతో తాను మానసికంగా ఒత్తిడికి లోనైనట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్ తదితరులు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.
Next Story