VD12 నుంచి సాలీడ్ అప్‌డేట్‌.. రక్తంతో తడిసిన పోస్టర్‌తో హైప్ పెంచేస్తున్న రౌడీ బాయ్

by Kavitha |
VD12 నుంచి సాలీడ్ అప్‌డేట్‌.. రక్తంతో తడిసిన పోస్టర్‌తో హైప్ పెంచేస్తున్న రౌడీ బాయ్
X

దిశ, సినిమా: యంగ్ హీరో విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు. VD12 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఇటీవల శ్రీలంక షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకోగా.. దాదాపుగా 60 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు ఇన్‌సైడ్ వర్గాల టాక్.

అయితే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్‌ను ఇచ్చింది. ఈ చిత్రాన్ని 2025 మార్చి 28న విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో.. విజయ్ దేవరకొండ వర్షంలో తడుస్తూ, ముఖంపై రక్తంతో చాలా కోపంగా పైకి చూస్తూ అరుస్తున్నాడు. మొత్తంగా ఈ పోస్టర్‌తో అభిమానుల్లో మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అలాగే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ ఆగస్టులో ప్రకటించనున్నట్లు తెలిపింది.


Advertisement

Next Story

Most Viewed