- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ క్షణం కోసం ఎప్పుడు ఎదురుచూడలేదు.. నాగచైతన్యతో ఎంగేజ్మెంట్‌పై మొదటిసారి స్పందించిన శోభిత
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే.. వాటన్నిటి రూమర్స్ అని కొట్టిపడేసిన ఈ జంట ఈ ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు. అక్కినేని ఇంట్లోనే కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే వీళ్ల ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత.. నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్‌పై ఫస్ట్ టైం స్పందించింది.
‘మా ఎంగేజ్‌మెంట్ ఇలాగే జరగాలి అని కలలు లేదా అంచనాలు, ప్లానింగ్ చేసుకోలేదు. ఆ క్షణం కోసం ఎదురు చూడలేదు. ఆ క్షణాన్ని సంతోషంగా ఆస్వాదించాను అంతే. చాలా సింపుల్‌గా, రిలాక్స్‌డ్‌గా, స్వీట్‌గా జరిగిపోయింది. నేను ఎలా అనుకున్నానో అలాగే జరిగింది. అందమైన విషయాలు జరిగినప్పుడు నాకు ఎలాంటి అలంకారాలు అవసరం లేదని నేను భావిస్తాను. ఆ క్షణమే నాకు చాలనిపిస్తుంది. అందుకే అది సింపుల్‌గా జరిగిందా లేదా అన్న ఫీలింగ్ నాకు కలగలేదు. ఎలా జరగాలో అలా జరిగింది. అది పర్ఫెక్ట్’ అని చెప్పుకొచ్చింది శోభిత.