మాకు లేని నొప్పి మీకెందుకు? 53 ఏళ్ల వ్యక్తిని పెళ్లాడటంపై నటి

by Prasanna |   ( Updated:2023-05-28 09:15:21.0  )
మాకు లేని నొప్పి మీకెందుకు? 53 ఏళ్ల వ్యక్తిని పెళ్లాడటంపై నటి
X

దిశ, సినిమా: తనకంటే 21 సంవత్సరాలు పెద్దవాడైన రాజకీయ నాయకుడు మధ్వేంద్ర కుమార్‌ను పెళ్లి చేసుకోవడంపై వస్తున్న విమర్శలపై నటి స్నేహల్ రాయ్ స్పందించింది. ఈ మేరకు గత పదేళ్ల క్రితమే ఇరువురి కుటుంబాల సమక్షంలోనే తమ వివాహం జరిగిందని చెప్పింది. అయితే చాలా పెద్దవాడైన పురుషుడిని మ్యారేజ్ చేసుకున్నందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేపోయినా జనాలెందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావట్లేదని వాపోయింది. ‘దీని గురించి మేము ఎప్పుడూ మాట్లాడలేదు. ప్రజలు మాత్రమే పెద్ద గొడవ చేస్తున్నారు. మా మధ్య వయస్సు అంతరం ఉన్నట్లు కూడా భావించలేదు. మా వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తోంది’ అంటూ నెగెటీవ్ కామెంట్లను తిప్పికొట్టింది.

Also Read..

స్టార్ డైరెక్టర్ వల్ల పవన్ కల్యాణ్- రేణుదేశాయ్ విడిపోయారా? బండ్ల గణేష్ వ్యాఖ్యలు వైరల్

Advertisement

Next Story