తండ్రిని ఫాలో అవుతున్న సితార.. తన మొదటి రెమ్యూనరేషన్‌ ఏం చేసిందో తెలుసా?

by Nagaya |   ( Updated:2023-07-15 15:41:18.0  )
తండ్రిని ఫాలో అవుతున్న సితార.. తన మొదటి రెమ్యూనరేషన్‌ ఏం చేసిందో తెలుసా?
X

దిశ, సినిమా : పీఎంజే జ్యువెల్లర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా తొలి అడుగు వేసిన సితార.. తాజాగా మీడియాతో ఇంటరాక్ట్ అయింది. ఈ క్రమంలో తొలి రెమ్యూనరేషన్ తల్లి లేదా తండ్రికి ఇచ్చారా? అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ఛారిటీకి ఇచ్చానని బదులిచ్చింది. ఇక తన మొదటి యాడ్ చూసి తండ్రి చాలా మెచ్చుకున్నాడని.. న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో తన ఇమేజ్ లాంచ్ చేశారని నాన్న చెప్పగానే, గట్టిగా హత్తుకుని ఏడ్చేశానని తెలిపింది. ఇది నిజంగా సర్‌ప్రైజ్ అంటూ పీఎంజే జ్యువెల్లర్స్‌కు థాంక్స్ చెప్పింది. కాగా తల్లి నుంచి తాను కాన్ఫిడెంట్‌గా ఉండాలని నేర్చుకున్నానని చెప్పిన సితార.. మొత్తానికి ఫస్ట్ మీడియా ఇంటరాక్షన్‌లో ప్రేక్షకులను ఫిదా చేసేసింది.

Advertisement

Next Story