చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. అతని ప్లేస్‌లో ఊహించని హీరో

by sudharani |   ( Updated:2023-07-12 12:59:05.0  )
చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. అతని ప్లేస్‌లో ఊహించని హీరో
X

దిశ, సినిమా: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాతో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. కాగా ఈ మూవీ తర్వాత చిరు తన తదుపరి ప్రాజెక్ట్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నాడు. మలయాళ చిత్రం ‘బ్రో డాడీ’ రీమేక్‌గా ఈ సినిమా రాబోతుంది. అలాగే ఈ మూవీకి చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఇక కథ ప్రకారం ఈ చిత్రంలో చిరంజీవి కొడుకు పాత్రలో నటించడానికి హీరో సిద్ధు జొన్నలగడ్డని సెలెక్ట్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం సిద్ధుకు డేట్స్ కుదరక ఈ మూవీ నుంచి తప్పుకున్నాడట. దీంతో అతని ప్లేస్‌లో మూవీ టీం మరో హీరోను సెలెక్ట్ చేసే పనిలో ఉంది. శర్వానంద్ లేదా కార్తికేయను ఫైనల్ చేసే యోచనలో ఉండగా.. కార్తికేయకు ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Read More: మంత్రి మల్లారెడ్డి ఫేమస్ డైలాగ్‌తో స్పీచ్ ఇచ్చి అదరకొట్టిన నవీన్ పొలిశెట్టి.. వీడియో వైరల్

Advertisement

Next Story

Most Viewed