- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫ్యామిలీ- వర్క్.. రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కఠినమైన పరీక్షే: శ్రేయాస్
దిశ, సినిమా : ఒక నటుడు కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ తన పనిని సక్రమంగా నిర్వర్తించడం అనుకున్నంత సులభం కాదంటున్నాడు శ్రేయాస్ తల్పాడే. రీసెంట్‌గా ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. కెరీర్ స్ట్రగుల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు పురుషులు ఫ్యామిలీ పెద్దగా బాధ్యతలు మోస్తూ నటనతోనూ ప్రజలను ఆకట్టుకోవడం కఠినమైన పనిగా పేర్కొన్నాడు. 'ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులకు తమ ప్రతిభ, పేరు చేరువ కావాలని ప్రతి కళాకారుడు కలలు కంటాడు.
ఈ విషయంలో నా కల నిజమైంది. నా పని పట్ల నాకు అందుతున్న ప్రేమ నిజంగా ఒక ఆశీర్వాదం. అయితే కుటుంబాన్ని, పనిని నిర్వహించడం అనేది ఏ కళాకారుడికైనా కష్టతరమైన నడక. ఫ్యామిలీ, వర్క్ రెండింటికి సమపాళ్లలో సమయం కేటాయించినపుడు విజయం సాధించగలరు. ఈ విషయంలో నా భార్య, కుటుంబ సభ్యులకు కృతజ్ఞుడను. భార్య పిల్లలు, తల్లిదండ్రులకు కేవలం గంట సమయం కేటాయించి కలలు నిజం చేసుకున్నా అది అర్థరహితమే' అంటూ తన అభిప్రాయాలు వెల్లడించాడు.
- Tags
- Shreyas Talpade