- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ దర్శకురాలికి షాక్.. రూ. 2 కోట్ల లీగల్ నోటీసు
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ-బొమ్మన్ దంపతుల వాస్తవ జీవనం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’. దర్శకురాలు కార్తికి గొంజాల్వెస్ నిర్మించిన ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. దర్శకురాలు కార్తికిపై బెల్లీ-బొమ్మన్ దంపతులు రూ. 2 కోట్లు లీగల్ నోటీస్‌ను పంపించారు. విషయం ఏంటంటే..
‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ సినిమాలో నటించినందుకు గాను ఇల్లు, వాహనం, బెల్లీ మనవరాలు చదువుకు సహాయం చేస్తానని.. అంతే కాకుండా సినిమా కలెక్షన్ల నుంచి కొంత మొత్తాన్ని ఇస్తానని దర్శకురాలు కార్తికి తమకి చెప్పారట. ఆస్కార్ వచ్చిన తర్వాత ప్రశంసలు, పురస్కారాలు ఆమె అందుకుని తమకు మొండి చెయ్యి చూపారని.. ఇచ్చిన మాటపై నిలబడలేదని బెల్లీ-బొమ్మన్ దంపతులు దర్శకురాలికి కోర్టు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై స్పందించమని ఓ మీడియా సంస్థ బెల్లీ దంపతులను కోరగా.. కేసు కోర్టులో ఉన్నందువల్ల తాము మాట్లాడమని అవసరమైతే తమ న్యాయవాదిని సంప్రదించమని తెలిపారు.