రాజకియాల్లోకి శివాజీ.. ఆ పార్టీలోకే వెళ్తా.. దూల తీరుస్తానంటూ కామెంట్స్!

by Jakkula Samataha |
రాజకియాల్లోకి శివాజీ.. ఆ పార్టీలోకే వెళ్తా.. దూల తీరుస్తానంటూ కామెంట్స్!
X

దిశ, సినిమా : నటుడు శివాజి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బాస్‌కు వెళ్లి వచ్చినప్పటి నుంచి ఈ హీరో పేరో సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్‌లో శివాజీ ప్రవర్తన చాలా మందికి నచ్చడంతో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఇక శివాజీ తాజాగా నటించిన వెబ్ సిరీస్ 90 సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హీరో వరస ఇంటర్వ్యూలతో చాలా బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే శివాజీ ఆ పార్టీలోకి వెళ్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మీరు సమైక్యవాది కదా తెలంగాణ ప్రాంతంకి సంబంధించిన పాత్రను పోషించడం ఎలా అనిపించింది..?” అని ప్రశ్నించారు.

దీనికి నటుడు శివాజీ సమాధానం ఇస్తూ..ఒక విషయం మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి నేను సమైక్యవాదిని కాదు ప్రత్యేక హోదా కోసం పోరాడాను అంతే సమైక్యవాదాన్ని ఎప్పుడు వినిపించలేదు. ప్రత్యేక తెలంగాణ అనేది 60 సంవత్సరాల కల అది సహకారం అయిపోయింది దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు . నాకు యాక్టింగ్ తప్ప మరొకటి రాదు ఒకవేళ ప్రజలకు సమస్యలు వస్తే మాత్రం ప్రజల కోసం కచ్చితంగా నేను గొంతు విప్పుతాను .. నన్ను కావాలని ఒక పార్టీకి అంటగట్టాలని చూస్తే ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళ్తా ..అందరి దూల తీర్చేస్తా ..కాబట్టి దయచేసి నా జోలికి రావద్దు ఎందుకంటే నేను అన్ని నిజాలే మాట్లాడుతాను అంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో కొంత మంది నెటిజన్స్ శివాజీ రాజకియాల్లోకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఏదైనా పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నాడని కామెంట్స్ చేస్తే మరికొంత మంది అలాంటి ఆలోచన శివాజీ అన్నకు లేదు అని కొట్టిపారేస్తున్నారు.

Advertisement

Next Story