పెళ్లి వేడుక జరుగుతుండగానే ఆ విషయంలో భార్యకు కండీషన్ పెట్టిన శర్వానంద్..!!

by Hamsa |   ( Updated:2023-06-05 05:03:22.0  )
పెళ్లి వేడుక జరుగుతుండగానే ఆ విషయంలో భార్యకు కండీషన్ పెట్టిన శర్వానంద్..!!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ శర్వానంద్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు. జూన్ 4న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాయర్ కూతురు రక్షిత రెడ్డితో శర్వానంద్ పెళ్లి జైపూర్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలు, రాజకీయ నేతలు కూడా వెళ్లారు. తాజాగా, శర్వానంద్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే పెళ్లి మండపంలోనే శర్వా తన భార్యకు ఓ కండీషన్ పెట్టాడట. ఫొటోకి ఫోజులు ఇచ్చే క్రమంలో ఎక్స్‌ప్రేషన్ ఇలా పెట్టు అలా పెట్టు అంటూ కండీషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో కాస్త అసౌకర్యంగా ఫీల్ అయిన రక్షిత రెడ్డి ఏంటి ఇదంతా ఎవరైనా చూస్తే ఓవర్ అనుకుంటారు అనే తీరుగా తన ఫేస్ పెట్టి శర్వానంద్ ని కాస్త కోపంగా చూసిందట. అయితే ఈ విషయం తెలిసిన వారు ఇప్పడే ఇలా కండీషన్లు పెడితే ఇంకా ముందు ముందు ఇంకెన్ని రూల్స్ పెడతారు అని అంటున్నారు.

Also Read: మనమిద్దరం పర్ఫెక్ట్ జంట కాదని నాకు తెలుసు కానీ.. భర్తపై యాంకర్ అనసూయ షాకింగ్ పోస్ట్

బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి ఓ ఇంటి వాడైన శర్వానంద్.. ఫొటోలు వైరల్

Advertisement

Next Story

Most Viewed