మరింత బోల్డ్ లుక్‌లో అర్జున్ రెడ్డి బ్యూటీ.. బికినీలో తగ్గేదే లేదంటూ ..

by Jakkula Samataha |
మరింత బోల్డ్ లుక్‌లో అర్జున్ రెడ్డి బ్యూటీ.. బికినీలో తగ్గేదే లేదంటూ ..
X

దిశ, సినిమా : అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ షాలిని పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. విజయ్ దేవరకొండ సరసన ప్రీతి శెట్టి పాత్రలో అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్‌గా చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో చేసి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అయినప్పటికీ ఈ అమ్మడుకు ఆశించిన స్థాయిలో మంచి ఆఫర్స్ ఏం రావడం లేదు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తన హాట్ హాట్ ఫోటో షూట్‌తో కుర్రకారును మాయ చేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది తన ఇన్‌స్టా గ్రాంలో పలు ఫొటోలను షేర్ చేసింది. అందులో షాలిని బోల్డ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. బికినీ ధరించి, హాట్ ఫోజులు పెడుతూ, సెక్సీ లుక్‌లో యూత్‌కు చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు.

ఇక అర్జున్ రెడ్డి తర్వాత షాలిని మహానటి సినిమాలో విఎన్ జానకి పాత్రలో కనిపించింది. తర్వాత తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన 118 సినిమాలో, రాజ్ తరుణ్ ఇద్దరిలోకం ఒక్కటే సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

Video credits to Shalini Pandey instagram

Advertisement

Next Story

Most Viewed