ఐదేళ్లు నరకం అనుభవించా: సల్మాన్ సోదరుడితో విడాకులపై సీమా

by Hamsa |   ( Updated:2022-09-05 06:16:43.0  )
ఐదేళ్లు నరకం అనుభవించా: సల్మాన్ సోదరుడితో విడాకులపై సీమా
X

దిశ, సినిమా: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సీమా సజ్‌దే ఖాన్ మాజీ భర్త సోహైల్ ఖాన్‌తో విడాకులకు గల కారణాలను వెల్లడించింది. 1998లో మతాంతర వివాహం చేసుకున్న ఈ జంట 22 ఏళ్ల తర్వాత విడిపోయారు. అయితే తాజాగా ఓ సమావేశంలో వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడిన సీమా.. ఇప్పటికే గత ఐదేళ్లుగా తాము విడిగానే ఉంటున్నామని చెప్పింది. 'మా అభిప్రాయాలు ఒకేలా లేవు. నేనొక ఫార్ములాని అనుసరిస్తే ఆయనొకటి చేస్తానంటాడు.

కొన్నిసార్లు పిల్లలకోసం ఇద్దరం కాంప్రమైజ్ అవుతూ ఒకే పద్ధతిని అనుసరించాం. అయిన అందులో కూడా భిన్నాభిప్రాయాలు ఎదురయ్యాయి. చిన్నప్పటి నుంచి ఏదైనా చేయాలని పట్టుబడితే చేసేదాకా వదలను. ఆయనతో విడిపోవాలని ఫిక్స్ అయిన వెంటనే దూరంగా ఉన్నా' అంటూ చెప్పుకొచ్చింది. కాగా 'అభిప్రాయాలు కలవలేదనే విషయం 22ఏళ్లకు అర్థమైందా?' అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారన్న ఆమె.. ఏది ఏమైనా తాను మహిళల అభిప్రాయాలకే మద్దతుగా నిలుస్తానని తెలిపింది.

Also Read : Porn Stars గా మారిన యంగ్ కపుల్స్.. అబ్బాయిలు కంటపడితే

Also Read : బ్రేకప్ కన్ఫాం చేసిన హీరో.. ఆ హీరోయిన్‌తో రిలేషన్ కట్

Advertisement

Next Story

Most Viewed