- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీ అభిమానం చూస్తుంటే భయమేస్తోందంటూ.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ నోట్
దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల ‘విరూపాక్ష’ సినిమాలో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో కలిసి ‘బ్రో’ చిత్రంలో నటించారు. బ్రో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్స్‌లో దూసుకుపోతుంది. ప్రస్తుతం తేజ్ బ్రో సినిమా సక్సెస్ టూర్స్ లో ఉన్నాడు. ఈ టూర్స్‌లో భాగంగా ఏపీలోని పలు ఊర్లు తిరుగుతూ అభిమానులని కలుస్తున్నాడు.
అక్కడ ఫ్యాన్స్ ఆయనను చూసిన ఆనందంలో హెల్మెట్ లేకుండా తిరుగుతుండగా చూసి తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశాడు. ‘‘అందరికీ నమస్కారం.. బ్రో విజయ యాత్రలో భాగంగా నాపై మీరు చూపించే అభిమానానికి చాలా థ్యాంక్స్. అందరినీ కలుసుకోవడం, మీ ప్రేమ పొందడం, సినిమా గురించి మీ నుంచి వినడం చాలా బాగుంది. నన్ను కలవడానికి వచ్చేవారు సెల్ఫీలు, ఫోటోలు అంటూ ఆప్యాయంగా దగ్గరికి వస్తున్నారు. వీలైనంతవరకు నేను మీకు అందుబాటులో ఉండటానికే ప్రయత్నిస్తున్నాను. అయితే ఈ క్రమంలో చాలామంది హెల్మెట్ ధరించకుండా బైకుల మీద ఫాలో చేయడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీలు, వీడియోలు తీయడం వంటివి చేస్తున్నారు.
ఈ విషయంలో నాకు ఎంతో భయాన్ని కలుగచేస్తుంది. మీ అభిమానంతో ఇలా చేస్తున్నప్పటికీ ఆ క్రమంలో మీకు ఎటువంటి హాని జరిగినా నాకు తీవ్ర మనస్థాపం కలిగిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని అభిమానుల్లా కన్నా బ్రదర్స్ లా భావిస్తాను. మీ భద్రత నా బాధ్యత. దయచేసి మీరు బైక్ మీద వెళ్ళినప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మరిచిపోకండి. నాకు మీ మీద ప్రేమను పొందుతూ ఉండే అవకాశాన్ని ఇవ్వండి. అర్ధం చేసుకోగలరు అని భావిస్తున్నాను’’ అంటూ ఎమోషనల్ నోట్‌ను ట్వీట్ చేశాడు.
Grateful for your love & kindness. Thank you! 🙏🏼#BroTheAvatar #BroVijayaYatra pic.twitter.com/ntpjS3Pg27
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 4, 2023