- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఢిల్లీ మెట్రోలో నటికి లైంగిక వేధింపులు.. అబ్బాయిలు గుంపుగా దాడిచేశారట

X
దిశ, సినిమా: కాలేజీ రోజుల్లో తనకు ఎదురైన లైంగిక వేధింపుల సంఘటనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది సన్యా మల్హోత్రా. ఈ మేరకు ఓసారి ఢిల్లీ మెట్రోలో కొంతమంది అబ్బాయిల గుంపు తనను కాసేపు ఆటపట్టించినట్లు చేస్తూ అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించారని చెప్పింది. అయితే ఆ సమయంలో తనతోపాటు చాలామంది జనాలు ఉన్నప్పటికీ ఎవరూ తనకు సహాయం చేయడానికి ముందుకు రాలేదని వాపోయింది. దీంతో నిస్సహాయంగా మిగిలిపోవడం తప్పా తానేమీ చేయలేకపోయానని, దాని గురించి తర్వాత ఎవరికైనా చెబితే తనకే ఏదైనా చెడు జరగవచ్చునని భావించి సైలెంట్ అయిపోయానని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నందుకు బాధగా ఉందన్న నటి మహిళలే ఒంటరిగా పోరాడటం నేర్చుకోవాలని సూచించింది.
Read More: దీపికతో ఆ పని చేయాలనుంది.. ఆమె నాకు బాగా నచ్చింది: గేల్
Next Story