ముంబై మాఫియాకు సవాలు విసిరిన రియల్ హీరో.. షారుఖ్‌పై సంజయ్‌గుప్తా ప్రశంసలు

by Hamsa |   ( Updated:2023-09-11 07:26:08.0  )
ముంబై మాఫియాకు సవాలు విసిరిన రియల్ హీరో.. షారుఖ్‌పై సంజయ్‌గుప్తా ప్రశంసలు
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్‌ కమిట్‌మెంట్, డేరింగ్‌పై ప్రముఖ దర్శకుడు సంజయ్‌గుప్తా ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు బాద్ షా నటించిన తాజా మూవీ ‘జవాన్‌’ను రీసెంట్‌గా వీక్షించినట్లు చెబుతూ కెరీర్‌ తొలినాళ్లలో షారుఖ్‌ ముంబై మాఫియాకు ఎలా ఎదురు నిలిచాడో గుర్తుచేశాడు. ‘షారుఖ్‌ఖాన్ కింగ్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ అనడంలో సందేహమే లేదు. 90వ దశకంలో బీటౌన్ మొత్తం అండర్‌వరల్డ్‌ కంట్రోల్‌లో ఉండేది. ఎంతటి సూపర్‌స్టార్‌ అయినా వారి ఆదేశాలను పాటించాల్సిందే. అలాంటి సమయంలో షారుఖ్‌ ఒక్కడే అండర్‌వరల్డ్‌ బెదిరింపులను ఏ మాత్రం పట్టించుకోలేదు. ‘మీరు నా శరీరంలోకి బుల్లెట్లు దించినా ఫర్వాలేదు. నేను మాత్రం మీ కోసం ఎప్పటికీ పనిచేయను. ఎందుకంటే నేను పఠాన్‌ను’ అంటూ మాఫియాకు సవాలు విసిరేవాడు. ఆ ధైర్యమే అతన్ని బాలీవుడ్‌ బాద్ షాగా మార్చింది. ఎవరికీ తలొగ్గని వ్యక్తిత్వమే ఉన్నతంగా నిలబెట్టింది. అంటూ తనదైన స్టైల్‌లో పొగిడేశాడు.

Advertisement

Next Story