‘కట్టప్ప’ పాత్రను మిస్ చేసుకున్న సంజయ్ దత్!

by sudharani |   ( Updated:2023-04-23 12:24:02.0  )
‘కట్టప్ప’ పాత్రను మిస్ చేసుకున్న సంజయ్ దత్!
X

దిశ, సినిమా: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన టాలీవుడ్ సినిమాల్లో ‘బాహుబలి’ ఒకటి. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో బాహుబలి, భల్లాల దేవుడు, శివగామి, దేవసేన, కట్టప్ప పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా కట్టప్ప పాత్ర కీలకం. సినిమాను మలుపు తిప్పి, రెండో భాగం కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన పాత్ర అదే.

‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే ట్విస్ట్‌తో మొదటి బాగం ముగుస్తుంది. జక్కన్న మూవీలో ఇలాంటి పాత్ర ఇస్తానంటే ఎవరైనా వదులుకుంటారా? బాలీవుడ్ హీరో సంజయ్ దత్ వదులుకున్నాడట. తాజాగా పాల్గొన్న ఇంటర్వూలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ‘కట్టప్ప రోల్ కోసం రాజమౌళి ముందు నన్ను సంప్రదించారు. ఆ పాత్ర అంత బలంగా లేదని భావించి తిరస్కరించాను. వాస్తవానికి కట్టప్ప పాత్ర నేను పోషించి ఉంటే.. ఎలా ఉండేదో కానీ ఆ పాత్రను ఊహించుకోలేని విధంగా సత్యరాజ్ నటించారు’ అని చెప్పుకొచ్చాడు.+

Also Read..

‘విరూపాక్ష’ సీక్వెల్‌‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు02

Advertisement

Next Story