ముప్పై సినిమాలు చేశావ్ నీ బతుక్కు ఏం పేరు వచ్చింది?.. నా మూవీలో నీ మొఖాన్ని AI తో రీప్లేస్ చేస్తా.. సందీప్ రెడ్డి వంగా

by Dishafeatures3 |
ముప్పై సినిమాలు చేశావ్ నీ బతుక్కు ఏం పేరు వచ్చింది?.. నా మూవీలో నీ మొఖాన్ని AI తో రీప్లేస్ చేస్తా.. సందీప్ రెడ్డి వంగా
X

దిశ, సినిమా: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ పాలిటిక్స్ గురించి ఓపెన్ గానే మాట్లాడాడు. తనకు అడ్డు వచ్చిన, తనను విమర్శించిన ప్రతి ఒక్కరికీ ఇచ్చి పడేశాడు. అయితే ఈ మధ్య 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'లో ప్రొఫెసర్ గా కనిపించిన నటుడు అడిల్ హుస్సేన్ ఈ చిత్రంలో నటించినందుకు రిగ్రెట్ అవుతున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన సందీప్.. ఎలాంటి మొహమాటం లేకుండా ఇచ్చిపడేశాడు. నటుడి కామెంట్స్ వీడియో లింక్ చేసి మరీ సోషల్ మీడియాలో ఏకి పడేశాడు.

' నువ్వు నమ్ముకుని ఇంతకు ముందు పనిచేసిన 30 సినిమాలు నీకు ఫేం తీసుకురాలేదు. నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతున్న నా ఫిల్మ్ నీకు పేరు తెచ్చింది. నిజానికి నిన్ను కాస్ట్ చేసినందుకు నేను సిగ్గు పడుతున్నా. నువ్వు ఎలాగూ షేమ్ ఫీల్ అవుతున్నావ్ కదా నా సినిమా చేయడం వల్ల. ఆ ఫీలింగ్ నీకు లేకుండా చేస్తా. నీ మొఖాన్ని AI తో రీప్లేస్ చేస్తా ' అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

Next Story

Most Viewed