క్యూటీ సమంతపై పొగడ్తల వర్షం కురిపిస్తోన్న నెటిజన్లు.. ఎందుకంటే?

by sudharani |   ( Updated:2024-08-21 08:56:29.0  )
క్యూటీ సమంతపై పొగడ్తల వర్షం కురిపిస్తోన్న నెటిజన్లు.. ఎందుకంటే?
X

దిశ, సినిమా: గత వారం రోజుల నుంచి సమంత గురించి నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ అమ్మడు టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది. బృందావనం, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, ఓ బేబీ, యశోద, శాకుంతలం వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. సినిమాల్లో నటించే సమయంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. కానీ అభిమానులకు షాక్ ఇస్తూ విడాకులు తీసుకుంటున్నామని సోషల్ మీడియా వేదిక ప్రకటించారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయిపోయింది.

తర్వాత కొద్దిరోజులకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే. దీంతో సమంత రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటించి.. అనంతరం సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం సామ్ మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంది. మళ్లీ సినిమాల బిజీలో పడిపోయింది. సామ్ ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని ప్రస్తుతం ఒంటరిగా నిలబడడం నిజంగా గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ప్రస్తుతం నెటిజన్ల కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story