Pawan Kalyan బర్త్ డే రోజు ఈ ట్వీట్ చూశారా?

by GSrikanth |   ( Updated:2022-09-08 06:30:30.0  )
Pawan Kalyan బర్త్ డే రోజు ఈ ట్వీట్ చూశారా?
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు సెప్టెంబర్ 2వ తేదీని ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన పనిలేదు. ఆ రోజున పవన్ కల్యాణ్ జన్మదినాన్ని ప్రతి ఏడాది ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే, ప్రతిసారి కంటే ఈ ఏడాది కాస్త ప్రత్యేకంగా జరిగింది. పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ సినిమాలైన తమ్ముడు, జల్సా సినిమాలు రీరిలీజ్ చేయడంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి సత్తా చాటాయి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఒక రీరిలీజ్ సినిమా ఒకేరోజు రూ.3.20 కోట్లు సాధించడం మొదటిసారి. దీంతో పవర్ స్టార్ సత్తా ఏంటో ఫ్యాన్స్ మరోసారి చాటిచెప్పారు. అంతేగాక, బర్త్ డే రోజు పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు వెల్లువ కొనసాగింది. ఇండస్ట్రీలోని ప్రముఖులే కాకుండా రాజకీయ నాయకులూ భారీగా విషెస్ చెప్పారు. అయితే, ప్రముఖ స్క్రీన్ రైటర్ సాయి మాధవ్ ముర్రా పెట్టిన బర్త్ డే విషెస్ ట్వీట్ మాత్రం అభిమానులకు తెగ కిక్ ఇచ్చింది. దీనిని అందరూ గమనించకపోయినా.. చూసిన వాళ్లు మాత్రం తెగ వైరల్ చేశారు. ''మొదట్లో ఆయన మనందర్లా ఉన్నాడనుకున్నారు.. తరువాత అందరూ ఆయన్లా ఉండాలనుకున్నారు.. ఇప్పుడు ఆయన్లా ఆయన మాత్రమే ఉండగలడు ఇంకెవరివల్లా కాదంటున్నారు. ఆయన పేరు చెప్పక్కర్లేని పవర్ స్టార్. ఆశయాలన్నీ తీరుతూ వందేళ్ళకు పైగా వర్ధిల్లాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు.'' అంటూ సాయి మాధవ్ ట్వీట్ చేశారు..

Also Read : మెగాస్టార్ గాడ్‌ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌‌కు పవర్ స్టార్

Advertisement

Next Story