జపాన్‌లో విడుదల కానున్న 'RRR'.. సరికొత్త రికార్డ్

by Seetharam |   ( Updated:2022-10-12 10:47:23.0  )
జపాన్‌లో విడుదల కానున్న RRR.. సరికొత్త రికార్డ్
X

దిశ, సినిమా : టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా విడుదలై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ద‌ర్శక‌ధీరుడు రాజ‌మౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చిలో విడుద‌లై రూ.1200 కోట్లకు పైగా వ‌సూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న జపాన్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ రోజు ప్రత్యేక వీడియోలో జపనీస్ లాంగ్వేజ్‌లో ట్రైలర్ విడుదల చేశారు. అంతేకాదు 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రమోషన్స్ కోసం రాజమౌళి జపాన్ వెళుతున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక ఆయనతో పాటు చరణ్, తారక్ కూడా వెళ్తారని తెలుస్తోంది.

ఈ స్థాయి గుర్తింపు రావాలంటే 20 ఏళ్లు పట్టేది : ఐకాన్ స్టార్

లేడీ యాంకర్‌పై బూతుపురాణం.. హీరో అరెస్ట్

Advertisement

Next Story