Vyuham Movie Teaser : ఎలా ఉందంటే?

by Hamsa |   ( Updated:2023-10-06 08:35:28.0  )
Vyuham Movie Teaser : ఎలా ఉందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులతో సంచలనం సృష్టిస్తుంటారు. అయితే ఆర్జీవీ వ్యూహాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ‘వ్యూహం’. సీఎం జగన్ జీవితం ఆధారంగా ఈ మూవీ రాబోతుంది. దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా, వ్యూహం టీజర్‌ను విడుదల చేశారు. అందులో ఏముందంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్ జీవితంలో జరిగిన పరిణామాలు, ఓదార్పు యాత్ర, సీబీఐ అరెస్టు చేయడం ఆ తర్వాత విడుదల వంటి విషయాలను చూపించారు. ఈ టీజర్ చూసిన వారు ఆర్జీవిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే ఆయన సీఎం అయిన తర్వాత పరిస్థుతులను ఆధారంగా చేసుకుని ‘శపథం’ సినిమాను కూడా తెరకెక్కించబోతున్న ట్లు తెలుస్తోంది. వ్యూహం, శపథం రెండు చిత్రాలు ఎలక్షన్ల కంటే ముందే రిలీజ్ అవుతాయని సమాచారం.

Read more : చాలా గ్యాప్ తర్వాత పవన్ చిత్రం‌లో నటించనున్న ఆలీ

Next Story

Most Viewed