- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కోసం ఐశ్వర్యరాయ్ లాంటి హీరోయిన్‌నే పక్కన పెట్టేసిన Renu Desai
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అండ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేక చెప్పుకోనవసరం లేదు. ప్రస్తుతం ఈ హీరో ఓ వైపు సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ.. మరోవైపు రాజకీయాల్లో బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈయన కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకున్నారు. ఇకపోతే రీసెంగ్‌గా ఇటలీలో జరిగిన తన అన్న నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లికి హాజరైన సంగతి తెలిసిందే. అక్కడ ఎలాంటి హంగామా చేయకుండా చాలా సింప్లిసిటీగా కనిపించారు. అయితే 2005లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బాలు’ మూవీ ఎంతగా హిట్ అయ్యిందో తెలిసిందే. పవన్ సరసన నేహా ఒబెరాయ్, శ్రీయ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాలో ‘ఏ బాయ్ కెన్ డు ఎవ్రీ థింగ్ ఫర్ ఎ గర్ల్’ అనే క్యాప్షన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే, ఈ సినిమా చేసేటప్పటికే పవన్-రేణు దేశాయ్ మధ్య ప్రేమ చిగురించిదట. రీసెంట్‌గా రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూకు హాజరై.. ‘‘బాలు మూవీ డైరెక్టర్ కరుణాకర్ నాకు చాలా క్లోజ్. అక్క అక్క అని పిలుస్తుంటారు. ఓ రోజు అక్క నాకు మంచి సినిమా దొరికింది. అందులో హీరోయిన్‌గా ఐశ్వర్యరాయ్ లెవల్‌లో ఉన్న ఓ అమ్మాయిని తీసుకుందామనుకుంటున్నా. అని చెప్పారు. దీంతో నాకు మిస్ వరల్డ్ లాంటి ఆమె పవన్ సరసన నటిస్తుందంటే.. ఎలా ఉంటుందోనని చాలా టెన్షన్ పడ్డాను. కానీ తన పిక్ చూశాక కరుణాకర్ చెప్పిన విధంగా అంత అందంగా ఏం లేదు.’’ అనిపించింది. అంటూ వెల్లడించింది.
కాగా రేణు దేశాయ్‌పై ఈ సినిమా విషయంలో నెట్టింట పలు వార్తలు వచ్చాయి. నేహా ఒబెరాయ్.. రేణు దేశాయ్ బంధువు. కావాలనే పట్టుపట్టి దర్శకుడితో గొడవపడి మరీ బాలు సినిమాలో తనను సెలక్ట్ చేసింది. అని వార్తలు వినిపించాయి. దీంతో తను స్పందించి.. అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. క్యాస్టింగ్ విషయంలో నేను వేలు పెట్టను. ఆమె పిక్ చూడటమే ఫస్ట్ టైమ్ నేను. మొదటిసారి ప్రచారం మొదలుపెట్టి నాకు షాక్ ఇచ్చారు.’ అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.