తన బిడ్డలను లాగేసుకుంటే తల్లికి ఎంత బాధ.. కంట తడి పెట్టిస్తున్న రేణు దేశాయ్ పోస్ట్.. అసలు ఏం జరుగుతుంది?

by Sujitha Rachapalli |   ( Updated:2024-04-30 15:07:46.0  )
తన బిడ్డలను లాగేసుకుంటే తల్లికి ఎంత బాధ.. కంట తడి పెట్టిస్తున్న రేణు దేశాయ్ పోస్ట్.. అసలు ఏం జరుగుతుంది?
X

దిశ, సినిమా: రేణు దేశాయ్ - పవన్ కళ్యాణ్ ప్రేమించుకున్నారు. పెళ్లి కాకుండానే సహజీవనం చేశారు. అకీరా పుట్టాక సొసైటీ ఒత్తిడితో మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత బేబీ కి వెల్ కమ్ చెప్పారు. అంత బాగుంది అనుకునే టైంలో విడాకులు తీసుకుని విడిపోయారు. అసలు ఏం జరిగిందో, ఎందుకు విడిపోయారో ఇద్దరూ క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత పవన్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా.. రేణు దేశాయ్ మాత్రం సింగిల్ మదర్ గానే ఉండిపోయింది. పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఈ జర్నీ చూసి కొందరు ఆమెను అభిమానిస్తే.. ఇంకొందరు మాత్రం పవన్ ను బ్యాడ్ చేస్తుందని విమర్శించారు. అన్నింటికీ సమాధానం చెప్తూ.. తన బిడ్డలు హ్యాపీగా ఉంటే చాలు అనుకుంది. అలాగే ఉంటుంది. ఈ క్రమంలో వారి పిల్లల గురించి ఎన్నో వీడియోలు షేర్ చేసి ఆనందపడే రేణు.. తాజాగా ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి షేర్ చేసింది.

ఆవు, గేదె, పొట్టేలు నుంచి తమ పిల్లలను వేరు చేస్తున్న కసాయిల గురించిన వీడియో స్టోరీస్ లో పెట్టింది. తల్లి ఎప్పుడు పిల్లల దగ్గరే ఉండాలి అని కోరుకుంటుందని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. కాగా తన ఇద్దరు బిడ్డలు తనకు ఎంత ఇంపార్టెంట్ చెప్తుందని కొందరు అంటుంటే.. అసలు ఆమె చుట్టూ ఏం జరుగుతుందో అని ఇంకొందరు అనుకుంటున్నారు.

Read More...

వరలక్ష్మితో పడక సుఖం కోరుకున్న టీవీ హెడ్.. ఇంటికొచ్చి మరీ భయపెట్టాడని సంచలన కామెంట్స్

Advertisement

Next Story