- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
శేఖర్ కమ్ముల మూవీ వదులుకున్న రెజీనా.. అది ఏ సినిమానో తెలిస్తే షాకవ్వాల్సిందే
దిశ, వెబ్ డెస్క్: తెలుగు హీరోయిన్ రెజీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో శివ మనుసులో శృతి మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసిన ఆమెకి ఏవి కూడా కలిసి రాలేదు. ఈ ముద్దుగుమ్మ తమిళ్, హిందీ మూవీస్ తో బిజీగా ఉంది. అయితే రెజీనా చేసిన ఉత్సవం మూవీ సెప్టెంబర్ 13న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె మీడియాతో కొన్ని విషయాలను పంచుకుంది.
ఈ నేపథ్యంలోనే తన ఫస్ట్ చేసిన మూవీ గురించి మాట్లాడింది. రెజీనా మాట్లాడుతూ.. నేను కాలేజీలో చదువుకునే రోజుల నుంచే సినిమాలు చేశాను. తెలుగులో ఆడిషన్స్ ఇచ్చి అనుకోకుండా ఒకేసారి రెండు మూవీలకు సెలెక్ట్ అయ్యాను. శివ మనసులో శృతి, శేఖర్ కమ్ముల గారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీకి కూడా నన్ను ఎంపిక చేసారు. కానీ, ఒక సినిమా మాత్రమే ఎంచుకోవాలి.. అప్పుడు శివ మనసులో శృతి డేట్స్ ఇచ్చాను. ఆ సమయంలో ఏ మూవీ చేయాలో కూడా అర్ధం కాలేదు .. కానీ, నా కెరీర్ స్టార్టింగ్ లోనే అలా రెండు సినిమాలకు ఒకేసారి సెలెక్ట్ కావడం గొప్ప విషయంగా తన మాటల్లో చెప్పుకొచ్చింది.
దీనిపై రియాక్ట్ అయినా నెటిజెన్స్ శేఖర్ కమ్ముల మూవీ చేయాల్సింది.. ఈ రోజున మీకు తెలుగులో ఎన్నో అవకాశాలు ఉండేవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.