The Kerala Story : ముందు సినిమా చూసి మాట్లాడండి.. విమర్శలపై స్పందించిన హీరోయిన్

by sudharani |   ( Updated:2023-05-04 13:59:06.0  )
The Kerala Story : ముందు సినిమా చూసి మాట్లాడండి.. విమర్శలపై స్పందించిన హీరోయిన్
X

దిశ, సినిమా : ‘ది కేరళ స్టోరీ’ ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది. కొందరు సినిమా టేకింగ్‌ను అప్రిషియేట్ చేస్తుంటే.. ఆ రాష్ట్ర సీఎంతో సహా మరికొంత మంది రాజకీయంంగా టార్గెట్ చేశారు. అయితే దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించింది హీరోయిన్ ఆదా శర్మ. రెండు నిమిషాల ట్రైలర్‌ని చూసిన తర్వాత చాలా మంది ప్రముఖులు, ఇండస్ట్రీకి చెందిన సీనియర్స్ దీని గురించి మాట్లాడరని తెలిపింది.

అయితే తన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ పెద్దలను గౌరవించమని చెప్తారని.. అందుకే ప్రతీ ఒక్కరికీ రెస్పెక్ట్‌తో ఒక విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పుకొచ్చింది. తమ బిజీ షెడ్యూల్ నుంచి రెండు గంటలు వెచ్చించి ఈ చిత్రాన్ని చూడాలని కోరింది. తాము సినిమాలో కేరళను ఎలాంటి అవమానకరమైన కోణంలో చూపలేదని గ్రహిస్తారని విశ్వసిస్తున్నట్లు తెలిపింది ఆదా.

ఇవి కూడా చదవండి : ‘భోళా శంకర్’ నుంచి చిరు వింటేజ్ లుక్ పోస్టర్స్ రిలీజ్

Advertisement
Next Story

Most Viewed