Mr. Bachchan: ట్రైలర్ అప్డేట్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రొమాంటిక్ పోస్టర్

by Hamsa |
Mr. Bachchan: ట్రైలర్ అప్డేట్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రొమాంటిక్ పోస్టర్
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. దీనిని హరీష్ శంకర్ తెరకెక్కిస్తుండగా.. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే మిస్టర్ బచ్చన్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, పోస్టర్స్, ట్రోల్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇందులోంచి విడుదలై సాంగ్స్ లోని రవితేజ, భాగ్యశ్రీ డ్యాన్స్‌పై నెట్టింట కొందరు ఫైర్ అయ్యారు. ప్రతిసారి కూతురులాంటి అమ్మాయిని అలా నలిపేయడం ఏంటనీ మండిపడ్డారు.

ఈ క్రమంలో.. తాజాగా, మిస్టర్ బచ్చన్ ట్రైలర్ అప్డేట్ ఇస్తూ రవితేజ ఓ రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేశాడు. ట్విట్టర్ వేదికగా ఆగస్టు 7న ట్రైలర్ విడుదల కాబోతున్నట్లు ప్రకటించాడు. అలాగే భాగ్యశ్రీ బోర్సేని గట్టిగా హత్తుకున్న రొమాంటిక్ పోస్టర్‌ను షేర్ చేశాడు. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. అది చూసిన వారంతా రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కాగా, ఈ మూవీకి మిక్కీ మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

Advertisement

Next Story

Most Viewed