Mr. Bachchan : ఓటీటీలోకి రవితేజ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

by Jakkula Samataha |
Mr. Bachchan : ఓటీటీలోకి రవితేజ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
X

దిశ, సినిమా : మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ అందింది. మాస్ హీరో త్వరలో మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో మూవీ రిలీజ్ కోసం అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, తాజాగా మూవీకి సంబంధించిన మరో న్యూస్ వైరల్ అవుతోంది.

మిస్టర్ బచ్చన్ మూవీని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కొనుగోలు చేసిందంట. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు, భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ చివర్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక 1980 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమాఆగస్టు 15న థియేటర్లలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ మెలోడి సాంగ్ విడుదల కాగా, నేడు రెప్పల్ డప్పుల్ అంటూ రెండో లిరికల్ సాంగ్ రిలీజ్ కానుంది.

Advertisement

Next Story