Ravi Teja : ‘మిస్టర్ బచ్చన్’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్

by sudharani |
Ravi Teja : ‘మిస్టర్ బచ్చన్’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ తాజా సినిమా ‘మిస్టర్ బచ్చన్’. డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇక రిలీజ్ సమయం కూడా దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్.

ఈ క్రమంలోనే తాజాగా ‘మిస్టర్ బచ్చన్’ నుంచి టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఓటీటీ పార్ట్నర్‌ను అఫీషియల్ లోగోతో పొందుపరిచారు. ఇక ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. రూ.19.50 కోట్లకు రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. కాగా.. ఇప్పటికే ఇందులో నుంచి ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. మూవీ గురించి ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed