ఆల్రెడీ పెళ్లైన వాడితో కొత్త జర్నీ స్టార్ట్ అంటూ రతికా రోజ్ షాకింగ్ పోస్ట్..

by Hamsa |   ( Updated:2024-01-20 04:27:24.0  )
ఆల్రెడీ పెళ్లైన వాడితో కొత్త జర్నీ స్టార్ట్ అంటూ రతికా రోజ్ షాకింగ్ పోస్ట్..
X

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 లో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అందరూ తమదైన ఆటతో ఊహించని విధంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అంతేకాకుండా షోలో ఉండగానే పలువురికి సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. ఇందులో ముఖ్యంగా రతికా రోజ్‌ ఓ స్పెషల్ క్రేజ్‌ను తెచ్చుకుంది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ తొలి వారంలోనే కామన్ మ్యాన్ గా వెళ్లిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో చాలా క్లోజ్ గా ఉంది. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని కూడా అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా నెగిటివిటీని అందుకుని ఎలిమినేట్ అయి ఇంట్లో నుంచి వచ్చేసింది. కొద్ది రోజులకే మళ్లీ బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా టాస్కులు ఆడకపోవడంతో రెండోసారి కూడా ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఏ షోలో కనిపించలేదు.

కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది. తాజాగా, ఓ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో కొత్త జర్నీ స్టార్ట్ అయిందని పోస్ట్ పెట్టింది. బిగ్‌బాస్ సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘కొంత మంది స్నేహితులు చాలా విలువైన వారు. మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఎక్కువ ప్రదేశాలు చూపించడానికి’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. బిగ్‌బాస్‌లో ఉన్న సమయంలో వీరిద్దరు నిత్యం గొడవలు పడి ఇప్పుడు కొత్త జర్నీ అంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed