- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్మిక డీప్ ఫేక్ వీడియోపై రియాక్టైన మాజీ ప్రియుడు.. ఏమన్నాడంటే..?
దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. A1 టెక్నాలజీ ద్వారా ఫేక్ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోల కారణంగా చాలా మంది ప్రాణాలను సైతం వదులుకుంటున్నారు. ఇప్పుడు హీరోయిన్ రష్మిక ఫేక్ వీడియో ఈ విధంగానే చేయడంతో.. అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి దీనిపై స్పందించారు.
రక్షిత్ శెట్టి హీరోగా వస్తున్న తాజా సినిమా ‘సప్తసాగరాలు దాడి సైడ్ B’. ఈ మూవీ నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రక్షిత్ రష్మిక డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడారు. ‘డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేయకుండా ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. ముందు ముందు ఇలాంటి ఫేక్ వీడియోలు రాకుండా జాగ్రత్తలు వహించాలి. ఎలాంటి సాఫ్ట్ వేర్ క్రియేట్ చేసినా దానికంటూ ఓకే లైసెన్స్ ఉండేలా చూసుకోవాలి. అది కూడా లిమిట్ దాటినప్పుడు వెంటనే అడ్డుకునేలా ఉండాలి. అలాంటి రూల్ వచ్చినప్పుడే ఇలాంటి వాటికి ఈజీగా చెక్ పెట్టొచ్చు. కఠిన రూల్స్ తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగి ఎంతో మంది అమాయకు అమ్మాయిలు బలవుతారు’ అంటూ చెప్పుకొచ్చాడు.