- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముందే చూసేస్తే తర్వాత ఆసక్తి ఉండదు.. నేషనల్ క్రష్ కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘పుష్ప’. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘పుష్ప 2’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుతున్న ఈ మూవీ గురించి.. పుష్పరాజ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీని లీకుల సమస్య వెంటాడుతుంది. సినిమా షూటింగ్‌లో ఉంటున్న సమయంలో సెట్ నుంచి ఫోటోలు లీక్ చేసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘పుష్ప 2’ నుంచి ఇప్పటి వరకు చాలా ఫొటోలు లీక్ అయ్యాయి. ఇక రీసెంట్‌గా అల్లు అర్జున్ చీర కట్టుకుని ఉన్న ఫొటో కూడా నెట్టింట హల్ చల్ చేసింది. ఈ విషయంపై తాజాగా రష్మిక మందన్న స్పందించింది.
‘పుష్ప 2’ లో అల్లు అర్జున్ సరసన నటిస్తున్న రష్మిక ఫొటోస్ లీక్‌పై మాట్లాడుతూ.. ‘షూటింగ్ సెట్ నుంచి నటీనటుల ఫొటోలు లీక్ చేయడం కరెక్ట్ కాదు. ఈ సినిమా కోసం ఎంతో మంది ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఫొటోలను ముందే చూసేస్తే.. తర్వాత మూవీ విడుదల అయ్యాక ఆసక్తి ఉండదు. థియేటర్లలో మీకు రెట్టింపు సంతోషాన్ని అందించడం కోసం టీం ఎంతో శ్రమిస్తుంది. దయచేసి సినిమా ప్రైవసీకి భంగం కలిగించొద్దు. మీరు అనుకున్న టైంలో మూవీ మీ ముందుకు వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.