- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆల్ ది బెస్ట్ మై లవ్’.. ఫ్యామిలీ స్టార్ మూవీపై రష్మిక ఆసక్తికర ట్వీట్.. క్యూటెస్ట్ రిప్లై ఇచ్చిన హీరో!
దిశ, సినిమా: పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం నుంచి రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సైతం మెస్మరైజ్ చేశాయి. మరోసారి ఫ్యామిలీ మ్యాన్ గా తనదైన నటనతో ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
ఇక సీతారామం చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ పరిశ్రమలో స్టార్ కథానాయికగా దూసుకుపోతుంది మృణాల్. మరోసారి ఈ బ్యూటీ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ ఫ్యామిలీ స్టార్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరి బ్యూటిఫుల్ కాంబోను వీక్షించడం కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 5 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే ఈ చిత్ర ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా నిర్వహిస్తుంది మూవీ టీమ్. మరో వైపు ఈ చిత్ర బృందానికి.. సినీ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికన ‘ఆల్ ది బెస్ట్’ చెబుతున్నారు.
ఈ క్రమంలో మన టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక కూడా రౌడీ హీరోకు విషెష్ తెలియజేసింది. ‘‘నేను రష్మిక. నా డార్లింగ్స్ పరశురామ్ పెట్ల, విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు. ఏప్రిల్ 5 వ తేదీన విడుదలయ్యే ఫ్యామిలీ స్టార్ తప్పకుండా విజయం సాధిస్తుంది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నాకు పార్టీ కావాలి. ఆల్ ది బెస్ట్ మై లవ్ మృణాల్ ’’ అంటూ రష్మిక మందన్న రాసుకొచ్చింది. ఈ ట్వీట్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్యూటెస్ట్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరి ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More..
‘వెంట వెంటనే మార్చేయడానికి వాడు ఫ్రెండ్ కాదు’.. ఫైమాపై స్టార్ నటుడు షాకింగ్ కామెంట్స్