అభిమాని సెల్ఫీ తీస్తుండగా ఫోన్ విసిరేసిన రణ్‌బీర్ (వీడియో)

by sudharani |   ( Updated:2023-02-04 11:55:10.0  )
అభిమాని సెల్ఫీ తీస్తుండగా ఫోన్ విసిరేసిన రణ్‌బీర్ (వీడియో)
X

దిశ, వెబ్‌‌డెస్క్: సాధారణంగా హీరోలు కనిపిస్తే అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ను సెల్ఫీ కోరాడు. అయితే సదరు వ్యక్తి సెల్ఫీ తీస్తుండగా రణ్‌బీర్ అతడి ఫోన్ తీసుకుని విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగిందంటే..

ఓ అభిమాని స్టార్ హీరో రణ్‌బీర్‌తో సెల్ఫీ దిగుతున్నాడు. మొదట సెల్ఫీకి నవ్వుతూ ఫోజ్ ఇచ్చాడు రణ్‌బీర్. ఆ అభిమాని ఫొటో బాగా రాలేదని మరో సెల్ఫీ తీశాడు. అప్పుడు కూడా స్మైల్ ఇచ్చాడు రణ్‌బీర్. ఇక మరోసారి అభిమాని సెల్ఫీ తీసేందుకు ప్రయత్నించగా కోపం వచ్చిన రణ్‌బీర్ ఆ వ్యక్తి ఫోన్ తీసుకుని వెనక్కి విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. దీనిపై రకరకాల స్పందనలు వినిపిస్తున్నాయి. ''ఇది ఏదో ఫోన్‌కి సంబంధించిన యాడ్ అయిఉంటుందని కొందరు.. రణ్‌బీర్ అలాంటి వాడు కాదని మరికొందరు'' ఇలా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్. మరి ఇంతకీ ఇది నిజంగా జరిగిందా.. లేదా మొబైల్ యాడ్‌కి సంబంధించిందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

Next Story