అదే నా అతిపెద్ద వీక్‌నెస్‌.. ఇప్పటికీ అలవాటు పోవట్లేదు?

by samatah |   ( Updated:2023-05-04 14:54:32.0  )
అదే నా అతిపెద్ద వీక్‌నెస్‌.. ఇప్పటికీ అలవాటు పోవట్లేదు?
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తనకున్న అతిపెద్ద వీక్‌నెస్ గురించి ఓపెన్ అయ్యాడు. తాజాగా అభిమానులతో పాల్గొన్న ఇంటరాక్షన్‌లో చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకున్నాడు. తన చిన్నతనంలో స్కూల్లోనే కాదు ఇతర సందర్భాల్లోనూ ప్రతి విషయానికి తడబడేవాడినని, ఇప్పటికీ అప్పుడప్పుడు అలాగే జరుగుతుందని చెప్పాడు. ‘ఎవరైనా నా పేరు అడిగితే.. ఫట్‌మని చెప్పలేను. కొద్దిగా తడబడతా. ఈ వయసులోనూ ఆ అలవాటు పోవట్లేదు. ఒక వీక్‌నెస్‌గా మారిపోయింది. కానీ, మిగతా విషయాల్లో ఫర్‌ఫెక్ట్‌గా ఉంటాను. మీరు అన్ని విషయాల్లో్ సమతుల్యంగా ఉండాలి. అలా ఉండేందుకే ప్రయత్నించండి. దానికోసం ప్రతిరోజు ధ్యానం చేయండి’ అంటూ అభిమానులో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి:

‘ది కేరళ స్టోరీ’ చిత్ర నిషేధానికి హైకోర్టు నో


Advertisement

Next Story