అభిమానులు క్షమించాలి.. ‘రానా నాయుడు’ ఒంటరిగానే చూడండి

by Vinod kumar |
అభిమానులు క్షమించాలి.. ‘రానా నాయుడు’ ఒంటరిగానే చూడండి
X

దిశ, సినిమా: ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కంటెంట్‌పై వస్తున్న విమర్శలపై రానా స్పందించాడు. నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రసారమవుతున్న ఈ సిరీస్‌లో అసభ్యకరమైన సీన్స్ ఉన్నాయని, శృతిమించిన శృంగార సన్నివేశాలను ఫ్యామిలీతో కలిసి ఎలా చూస్తామంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్విటర్ వేదికగా రియాక్ట్ అయిన హీరో.. ‘ఈ సిరీస్‌ను ఆదరించిన సినీ ప్రియులకు ధన్యవాదాలు.

‘రానా నాయుడు’షోను కుటుంబంతో కాకుండా ప్రతిఒక్కరూ ఒంటరిగా చూడాలని కోరుతున్నా. ఇది ‘ఏ’ రేటెడ్ సినిమా. 18 ప్లస్ వయసు వారికే’ అంటూ చెప్పుకురావడం గమనార్హం. కాగా మరోసారి ఈ ట్వీట్‌పై కూడా విమర్శలతోపాటు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ భిన్నంగా స్పందిస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story

Most Viewed