మరో మూడు సీజన్లతో రానున్న ‘రానా నాయుడు’?

by Hamsa |
మరో మూడు సీజన్లతో రానున్న ‘రానా నాయుడు’?
X

దిశ, సినిమా: దగ్గుబాటి ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్ ఎట్టకేలకు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. అలా వచ్చిందో లేదో.. ఈ వెబ్‌ సిరీస్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వెంకి మామ ఇమేజ్ మొత్తం ఈ సిరీస్‌తో డ్యామేజ్ అయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మూడు దశాబ్దాల సినీ కెరీర్‌లో వెంకటేష్ దాదాపు చేసినవన్ని ఫ్యామిలీ సినిమాలే. ముఖ్యంగా వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్‌ వేరు.

అలాంటిది ఈ సీజన్ లో వెంకీ భారీగా బూతులు మాట్లాడటం ప్రేక్షకులను కాస్త ఇబ్బందికి గురిచేసింది. ఇంకో విషయం ఏమిటంటే ఈ సిరీస్ మరో మూడు సీజన్‌లు రానున్నట్లు తెలుస్తోంది. దీనికి వెంకీ మామ సంతకం కూడా పెట్టారు. కానీ, మిగతా సీజన్లు కూడా ఇలాగే ఉంటే వెంకటేష్ ఇమేజ్‌ డ్యామేజ్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

Advertisement

Next Story