‘ఫోర్బ్స్’ మ్యాగజైన్‌పై మెరిసిన రామ్‌చరణ్‌, ఉపాసన.. అట్రాక్టివ్ లుక్స్‌తో అదరగొట్టేశారు !

by Prasanna |   ( Updated:2023-12-23 15:20:45.0  )
‘ఫోర్బ్స్’ మ్యాగజైన్‌పై మెరిసిన రామ్‌చరణ్‌, ఉపాసన.. అట్రాక్టివ్ లుక్స్‌తో అదరగొట్టేశారు !
X

దిశ, సినిమా: ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ మూవీ నుంచి తన ఇమేజ్‌‌ను ఓ రేంజ్‌లో పెంచుకుంటూ పోతున్నాడు రామ్ చరణ్. ఆస్కార్‌‌తో ఏకంగా అంతర్జాతీయ మీడియాలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఇప్పటికీ ఆ ఇమేజ్‌ని తనదైన స్టయిల్‌లో క్యాష్‌ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. కాగా తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు రామ్‌చరణ్‌. ఏంటంటే.. ఫేమస్ బిజినెస్ మ్యాగజైన్ అయిన ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన లేటెస్ట్ ఎడిషన్‌ కవర్‌పేజీపై తన భార్య ఉపాసనతో కలిసి దర్శనమిచ్చాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇది చూసిన మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా మ్యాగజైన్ కవర్‌ పేజీపై చరణ్‌, ఉపసాన లుక్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తు్న్నాయి. కాగా ప్రస్తుతం చరణ్‌.. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. మూవీ చిత్రీకరణ దశలో ఉంది. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్‌ కానుంది.

Read More..

సీన్ మారింది.. షారుఖ్‌ను రీప్లేస్ చేసిన ప్రభాస్.. ఒక్క షో కూడా లేకుండా..

Advertisement
Next Story

Most Viewed