ఇన్‌స్టాలో 9M ఫాలోవర్స్‌ సొంతం చేసుకున్న చెర్రీ..

by Hajipasha |   ( Updated:2022-10-18 09:45:10.0  )
ఇన్‌స్టాలో 9M ఫాలోవర్స్‌ సొంతం చేసుకున్న చెర్రీ..
X

దిశ,సినిమా: 'ఆర్ఆర్ఆర్'తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా 'ఆర్‌సి‌15'గా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో వస్తుంది. ఇదిలావుంటే.. రామ్‌చరణ్ ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా విషయంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటున్న చెర్రీ.. తాజాగా ఇన్‌స్టాలో 9 మిలియన్ ఫాలోవర్స్‌ను అతితక్కువ సమయంలో సొంతం చేసుకుని రికార్డు సాధించాడు. దీంతో చరణ్ క్రేజ్ మరింత పెరిగిందంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story