ఆ హీరోతో పనిచేయడం నా అదృష్టమే.. రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Prasanna |   ( Updated:2023-09-13 11:50:10.0  )
ఆ హీరోతో పనిచేయడం నా అదృష్టమే.. రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోయినా తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న ఆమె ‘ఇండియన్‌2’తోపాటు శివకార్తికేయన్‌ హీరోగా ఆర్‌.రవికుమార్‌ రూపొందిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ కామెడీ మూవీ ‘అయలాన్‌’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘శివకార్తికేయన్‌ సినిమా అంటే హీరోయిన్లంతా లక్కీగా ఫీలవుతారు. కారణం తను మంచి కథల్ని ఎంచుకుంటాడు. పైగా ఆయన సినిమాల్లో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. సినిమా మినిమమ్‌ గ్యారంటీ. నాకు ‘అయలాన్‌’లో ఛాన్స్ రావడాన్ని అందరూ లక్కీ అంటున్నారు. నిజంగా ఆ మాటలు విన్నపుడు నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. శివకార్తికేయన్‌తో పని చేయాలనే నా డ్రీమ్‌ నిజమైంది. ఇది అన్ని సినిమాల్లాంటి స్టోరీ కాదు. వెరైటీ మూవీ. ప్రేక్షకులతోపాటు ‘అయలాన్‌’ విడుదల కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అందరినీ అలరించడమే కాదు బిగ్ హిట్ అవుతుందని నమ్ముతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More: బాత్ రూంలో బట్టలు విప్పి వెనకా ముందు చూపించిన బోల్డ్ బ్యూటీ.. ఇక ఆగలేం అంటున్న నెటిజన్స్

Advertisement

Next Story