నన్ను ఈజీగా హర్ట్ చేయొచ్చు.. అప్పటి నుంచే ఇలా మారిపోయా.. రష్మిక ఎక్స్‌బాయ్ ఫ్రెండ్

by Nagaya |   ( Updated:2023-11-14 11:41:17.0  )
నన్ను ఈజీగా హర్ట్ చేయొచ్చు.. అప్పటి నుంచే ఇలా మారిపోయా.. రష్మిక ఎక్స్‌బాయ్ ఫ్రెండ్
X

దిశ, సినిమా : హీరో రోహిత్ శెట్టి ప్రస్తుతం చాలా ఎమోషనల్ పర్సన్‌గా మారిపోయానని తెలిపాడు. రీసెంట్‌గా ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఆయన.. ‘సైడ్ - బి’ చేస్తున్న టైమ్‌లో చాలా సెన్సిటివ్‌ అయిపోయానన్నాడు. ఇప్పుడు తనను ఎవరైనా ఈజీగా హర్ట్ చేయొచ్చని చెప్పాడు. ఈ మూవీలో ఎదురయ్యే పరిణామాలే తనకు జీవితపాఠాలు నేర్పాయని.. ఇలా చేంజ్ చేశాయని వివరించాడు. ‘అవనే శ్రీమన్నారాయణ’, ‘చార్లీ 777’ చిత్రాలు చేస్తున్నప్పుడే.. ఈ ఎమోషనల్ జర్నీ స్టార్ట్ అయిందని.. సైడ్ - ఏ, సైడ్ - బి పూర్తయ్యేసరికి పూర్తిగా మారిపోయానని చెప్పాడు.

కాగా రక్షిత్ శెట్టితో రష్మిక మందన్న ఎంగేజ్మెంట్‌ అనివార్య కారణాల వల్ల బ్రేక్ అయింది. ఆ తర్వాత వీరిద్దరు కలుసుకోనప్పటికీ.. ఆమె గురించి ఇంటర్వ్యూలలో ప్రశ్నించిన ప్రతిసారి ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు శెట్టి.

Advertisement

Next Story