- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Rajinikanth: ‘వెట్టైయాన్’ నుంచి అదిరిపోయే అప్డేట్.. స్పీకర్లను రెడీగా ఉంచుకోండంటూ అంచనాలు పెంచేస్తున్న ట్వీట్
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అదే ఫామ్‌తో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రజెంట్ తలైవా నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టైయాన్’. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
అయితే వెట్టైయాన్ చిత్రాన్ని టీ.జె.జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అయితే ఇప్పటికే వెట్టైయాన్ నుంచి విడుదలైన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, వెట్టైయాన్ మూవీ నుంచి అప్డేట్ విడుదల చేస్తూ మేకర్స్ తలైవా పోస్టర్‌ను వదిలారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘మనసిలాయో’ సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మీ స్పీకర్లను 🔊 సిద్ధంగా ఉంచుకోండి! అనే క్యాప్షన్ జత చేయడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తలైవా మనసిలాయో పాటపై భారీ అంచనాలు నెలకొన్నాయి.