Jr N.T.R, Ram Charanలకు Rajamouli సీరియస్ వార్నింగ్.. మీడియా ఏకిపారేస్తుందంటూ

by samatah |   ( Updated:2023-07-23 07:37:39.0  )
Jr N.T.R, Ram Charanలకు Rajamouli సీరియస్ వార్నింగ్.. మీడియా ఏకిపారేస్తుందంటూ
X

దిశ, సినిమా: ఎన్టీఆర్, రామ్ చరణ్ అండ్ రాజమౌళి కాంబోలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అందుకొని ఇండియా సినిమా హిస్టరీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆస్కార్‌కు వెళ్లినప్పుడు రాజమౌళి.. చరణ్ అండ్ తారక్‌కు ఒక విషయంపై వార్నింగ్ ఇచ్చాడట. అంతేకాదు ఇద్దరికీ గట్టిగా క్లాస్ పీకాడట. ఆ విషయాన్ని రామ్ చరణ్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ‘ఉదయం 7 గంటలకి అందరూ రెడీగా ఉండాలి. ఇదేమి సౌత్ ఇండియా మీడియా లేదా బాలీవుడ్ మీడియా కాదు. ఆస్కార్‌కు మనం మొదటిసారి వచ్చాం. ఏ కొంచెం మనం దొరికినా మీరేమన్నా హాలీవుడ్ సూపర్ స్టార్స్ అనుకుంటున్నారా? అని ఇక్కడ మీడియా మనల్ని ఏకిపారేస్తారు. అలాంటి మాటలు నేను వినకూడదు అనుకుంటున్నా. కాబట్టి త్వరగా పడుకొని, త్వరగా నిద్ర లేవండి. అని సీరియస్‌గా చెప్పాడు’ అంటూ చెర్రీ గుర్తుచేసుకున్నాడు. ఇక అతను చెప్పినట్లే తాము అలర్ట్‌గా ఉన్నామని, ప్రపంచవ్యాప్తంగా తమపై ప్రశంసలు కురవడం ఎప్పటికీ మరిచిపోలేనన్నాడు చెర్రీ.

Also Read: అలా చేయడం వల్ల Upasana నా చెంప చెల్లుమనిపించింది.. Ram Charan కామెంట్స్ వైరల్

Advertisement

Next Story