రాంచరణ్ పొట్టిగా ఉంటాడని ఆ మూవీలో రాజమౌళి హీరోయిన్‌ను మార్చేశాడట!

by Anjali |   ( Updated:2023-07-24 09:46:05.0  )
రాంచరణ్ పొట్టిగా ఉంటాడని ఆ మూవీలో రాజమౌళి హీరోయిన్‌ను మార్చేశాడట!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతగా ఆడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా అప్పట్లో ఏకంగా రూ.80 కోట్ల భారీ వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. కాగా 2009లో రిలీజైన ఈ మూవీలో కాజల్ కథానాయికగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఇందులో మిత్రబ్రింద ప్లేస్‌లో టాలీవుడ్ హీరోయిన్ అనుష్క ఉండాల్సిందట. జక్కన్న డైరెక్షన్ వహించిన ‘విక్రమార్కుడు’ చిత్రంలో అనుష్క అద్భుతంగా నటించడంతో మగధీరలో రాజకుమారి పాత్రలో ఈ హీరోయిన్ అయితేనే పూర్తిగా న్యాయం చేయగలదని రాజమౌళి భావించాడట. కానీ అనుష్క కంటే చరణ్ పొట్టిగా ఉంటాడు కాబట్టి, హైట్ డిఫరెన్స్ ఎక్కువ అని ఒకే ఒక్క రీజన్‌తో ఈ మూవీలో చేయడానికి అంగీకరించలేదట అనుష్క. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

Read More : దొండచేనును కాపలా కాస్తున్న కాజల్.. అసలేమైదంటే?

Advertisement

Next Story