- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తన ఫస్ట్ క్రష్ పేరు చెప్పేసిన Kareena Kapoor.. ఇంతకాలం తెలుసుకోలేకపోయానంటూ హీరో పశ్చాత్తాపం..
దిశ, సినిమా: స్టార్ నటి కరీనా కపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ క్రష్ రాహుల్ రాయ్ అని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై స్పందించిన రాహుల్.. నిజంగా కరీనాకు తనపై ఇంత ప్రేమ ఉందని తెలిసి ఆశ్చర్యపోయానంటున్నాడు. 1990లో వచ్చిన ‘ఆషికి’ మూవీతో భారీ ప్రజాధారణ పొందిన ఆయన.. నటీమణుల మనసులు కూడా గెలుచుకున్నట్లు గుర్తించలేదన్నాడు. ‘నేను చాలా కాలంగా కరీనాను కలవలేదు. కరిష్మాను మాత్రమే తరచుగా కలుస్తూ ఉండేవాడిని. అప్పుడపుడు కరీనా గురించి మాట్లాడుకునేవాళ్లం. అయితే నేను హీరోగా ఉన్నపుడు కరీనా కెరీర్ మొదలుకాలేదు. ఆమెకు నా మీద ప్రేమ ఉందని తెలియదు. ఎవరూ చెప్పలేదు’ అన్నాడు. ఇక ‘నాకు ఇష్టమైన సినిమా ‘ఆషికి’. నా మొదటి క్రష్ రాహుల్. ఆయన కోసమే ఆ మూవీకోసం 8సార్లు థియేటర్‌కి వెళ్లాను. అప్పుడే ఆయనంటే ఇష్టం పెరిగింది. ఇతరులకు చెప్పడానికి భయపడ్డాను’ అంటూ కరీనా ఓ ఇంటర్వ్యలో బహిరంగంగా అంగీకరించింది.
Also Read: వాళ్లంతా చీ కొట్టిన క్యారెక్టర్‌ను నాకు అంటగట్టారు.. ఆడిషన్ కూడా చేయలేదు..