PUSHPA-2: పుష్ప-2 నుంచి అదిరిపోయే కీలక అప్‌డేట్.. ప్రధాన పాత్రలో బాలీవుడ్ హీరో! అతడు ఎవరంటే?

by Shiva |   ( Updated:2024-03-08 11:32:37.0  )
PUSHPA-2: పుష్ప-2 నుంచి అదిరిపోయే కీలక అప్‌డేట్.. ప్రధాన పాత్రలో బాలీవుడ్ హీరో! అతడు ఎవరంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రధాన పాత్రలో నటించిన పుష్ప ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ పడిన కష్టానికి ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నయా రికార్డ్‌ను నెలకొల్పింది. అయితే, ప్రస్తుతం ఆ మూవీకి కొనసాగింపుగా వస్తున్న పుష్ప-2 కూడా ఖర్చు విషయంలో ఏ మాత్రం తగ్గకుండా నిర్మాతలు తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిపోయే న్యూస్ చెప్పారు. అదేంటంటే.. పుష్ప-2 మూవీలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ పాపులర్ యాక్టర్ సంజయ్‌ దత్‌ నటించబోతున్నారు. ప్రస్తుతం ఇదే న్యూస్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. త్వరలోనే ఈ రూమర్స్ మూవీ మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు. ఇక సంజయ్ దత్ మాస్ ఎంట్రీతో పుష్ప-2పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

Advertisement

Next Story